పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ `తొలిప్రేమ`. ఇది ఓ క్లాసిక్, పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. దేవా సంగీతం అందించాడు. ఎస్.ఎస్.వి ఆర్ట్స్ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం 1998లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు(dil raju) దశ మార్చింది కూడా ఈ సినిమానే. ప్రస్తుతం ఆయన ఈ స్థాయిలో ఉన్నారంటే తొలిప్రేమ సినిమానే అందుకు కార‌ణం. ఈ విషయం ఆయన స్వయంగా వెల్లడించారు.

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ తొలి నాలుగేళ్లలో దిల్ రాజుకు అన్నీ ఫ్లాపులే ఎదురయ్యాయి. సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నా కూడా పరిస్తితి మారలేదు. దిల్ రాజు ఫ్యామిలీకి సొంతంగా ఆటోమొబైల్ వ్యాపారం(automobile business) ఉండేది. సినిమాల ద్వారా ఏర్ప‌డ్డ నష్టాలను ఆటోమొబైల్ ఫీల్డులో భర్తీ చేసుకునేవార‌ట‌. అయితే నాలుగేళ్ల వ్యవధిలో కోటి రూపాయల దాకా దిల్ రాజు నష్టపోయార‌ట‌. ఇక ఆ స‌మ‌యంలో ఎంతో క‌ష్ట‌ప‌డి ఓ క‌న్న‌డ సినిమా రీమేక్ నైజాం హక్కులను కొనుగోలు చేశార‌ట‌. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పోయిందంతా మ‌ళ్లీ వ‌చ్చింద‌ట‌.

ఆ త‌ర్వాత తొలి ప్రేమ(tholi prema) నైజాం రైట్స్‌తో దిల్ రాజు దశ తిరిగిందట‌. తొలి ప్రేమ సినిమా చూడ‌క‌పోయినా రిస్క్ చేసి రూ. 72 లక్షలు పెట్టి నైజాం హక్కుల‌ను కొనుగోలు చేశాడ‌ట‌. అయితే అనూహ్యంగా అప్ప‌ట్లో ఆ సినిమా ఏకంగా రూ. 2.8 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో దిల్ రాజు పంట పండింది. పెట్టుబ‌డి పోను దిల్ రాజుకు `తొలి ప్రేమ‌` భారీ లాభాల‌ను అందించింది. ఇక ఈ సినిమా త‌ర్వాత దిల్ రాజు వెన‌క్కి తిరిగి చూసుకోలేదట‌. ఈ క్ర‌మంలోనే నిర్మాత‌గా మారి టాలీవుడ్ లో సూప‌ర్ స‌క్సెస్ ప‌ర్స‌న్‌గా గుర్తింపు పొందారు.

https://www.youtube.com/watch?v=KbYYOkMdS18&t=1357s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *