Inaya Sultana Wiki, Biography, Age, Movies List, Family, Husband Name, Bigg  Boss Telugu 6 And More – BiggBoss Telugu Vote

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు పొందాలి అంటే హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడాలి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఉంటారు.. లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా దర్శక నిర్మాతలు, హీరోలు కొంతమంది హింసిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మహిళలకు సొంత ఇల్లుతో సహా ఎక్కడ రక్షణ లభించడం లేదు. ఇంట్లో అయిన వాళ్ల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తే.. బయట ఎందరో మృగాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడపాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అమ్మాయిలు మరింతగా ఇబ్బందులకు గురి అవ్వడమే కాకుండా తాము ఇబ్బంది పడ్డ సందర్భాలను కూడా ధైర్యంగా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన కమిట్మెంట్ అడిగారు అని వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్ట్ ఇనయా సుల్తానా. గతంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ కంటే ముందు ఏవం జగత్, బుజ్జి ఇలా రా , నటరత్నాలు ఇలాంటి చిన్న సినిమాలలో నటించింది. అయితే వాటి వల్ల రాని గుర్తింపు ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా లభిస్తోందని చెప్పవచ్చు.

అంతేకాదు రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన డాన్స్ వీడియో ఈమెకు మరింత పాపులారిటీని తెచ్చి పెట్టింది. అంతేకాదు ఒకటి రెండు వారాలకి వెళ్లిపోతుందనుకున్న 13వ వారానికి చేరుకుంది.. అంటే దానికి కారణం రాంగోపాల్ వర్మ అని ప్రత్యక్షంగా చెప్పవచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే కాస్టింగ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను .. కానీ మనకు ఇష్టం లేకుండా బలవంతంగా మనతో ఏం చేయించలేరు.. నాకు కూడా ఇలాంటి ఆఫర్లు చాలానే వచ్చాయి.

కానీ నాకు అవసరం లేదని వదిలేసుకున్నాను. ఎవరు డైరెక్ట్ గా అడగరు. కానీ వాళ్ళ మాటలు వింటే మనకు అర్థమవుతుంది. నన్ను కమిట్మెంట్ అడిగారు.. ఒకవేళ ఒప్పుకొని ఉంటే ఈపాటికి స్టార్ హీరోయిన్ అయి ఉండేదాన్ని.. కానీ నేను నా సొంత టాలెంట్ ని ఉపయోగించి నటిగా ఎదగాలని కోరుకుంటున్నాను .. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను “అంటూ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *