ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన మేజర్(MEJOR) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఉన్ని కృష్ణన్ అనే ఆర్మీ అధికారి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్రలో నటించి తన నటన కు మంచి మార్కులు వేయించుకున్నారు. తాజాగా ఈయన నటించిన హిట్-2 సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. అడవి శేష్(adivi sesh) మాట్లాడుతూ.. నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు సొంతం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ముందుగా ఆ సినిమాలో నలుగురు హీరోలు అని చెప్పి నన్ను తీసుకున్నారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఏమైందో ఏమో తెలియదు కానీ డైరెక్టర్ ప్యాకప్ చెప్పి నన్ను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పారు.కానీ ఆ టైం లో నాకేమీ అర్ధం కాలేదు.

అయితే ఆ టైంలో నా వయసు చాలా చిన్నది. అందుకే తెలియని ఏజ్ లో నేను సొంతం(sontham) మూవీ లో నటించడానికి ఒప్పుకున్నాను. ఆ సినిమా చేసే టైంలో నేను పెద్దవాడిలా చాలా బిల్డప్ ఇచ్చేవాడిని. మా అమ్మ పెట్టుకునే కాటుకను గడ్డంలా పూసుకొని చాలా ఓవర్ చేసే వాడిని. ఇక సొంతం మూవీ లో నటించడానికి ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఇక అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదని నిర్ణయించుకున్నాను.

నేను నా వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితాన్ని పూర్తిగా ఎప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతానో ఆ టైంలోనే పెళ్లి చేసుకుంటాను. అందుకే ఇప్పుడు పెళ్లికి దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను. నా ఫోకస్ మొత్తం సినిమాల పైనే ఉంది అంటూ ఆ ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పుకొచ్చారు.ఇక అడవి శేషు హీరోగా వచ్చిన హిట్-2(hit-2) సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *