ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(samantha) మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా సమంత ఇంటికే పరిమితం అయింది. ఇటీవల ఈమె నటించిన `యశోద` సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొనలేకపోయింది. హ‌రి-హ‌రీష్ ద్వ‌యం దర్శకత్వం వహించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

`యశోద` ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాజాగా సమంత ఫ్యాన్స్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే సమంత మయోసైటిస్(myositis) వ్యాధి నుంచి దాదాపు కోలుకుందట. మరి కొద్ది రోజుల్లోనే సమంత సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వబోతోందట.

అంతేకాదు, సమంత తన తదుపరి ప్రాజెక్ట్స్ పై సైతం దృష్టి సారించిందట. ప్రస్తుతం సమంత చేస్తున్న చిత్రాల్లో `ఖుషి` ఒకటి టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా శివ‌ నిర్వాణ‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని సైతం త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావించారు.

కానీ ఇంతలోనే సమంత అనారోగ్యానికి గురైంది. కానీ తాజాగా ఆమె షూటింగ్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ రెండో వారం నుంచి ఖుషి(kushi) తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ జరగబోతుందని.. విజయ్-సమంతల‌పై ల‌పు కీల‌క‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ కూడా రానిందని టాక్ న‌డుస్తోంది. మరి ఇదే నిజమై సమంత మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యిందంటే ఆమె అభిమానులకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *