రామ్ చరణ్.. శంకర్ ల కాంబోలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఇటీవలే అత్యంత కీలకమైన పాటను న్యూజిలాండ్ లోని అత్యంత అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరించేందుకు వెళ్లిన విషయం తెల్సిందే.

గత కొన్ని రోజులుగా ఈ పాటను పూర్తి చేసిన ఈ పాట యొక్క షూటింగ్ ప్రారంభకు ముందు పాట యొక్క బడ్జెట్ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. మీడియం రేంజ్ హీరోతో రెండు సినిమాలు చేసేంతగా ఆ పాటకే దర్శకుడు శంకర్ ఖర్చు చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ అనే విషయం తెల్సిందే. ఇంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి రాబోతున్న అత్యంత ఖరీదైన సినిమా ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *