దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారీసు’. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ను జనవరి 12 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట కు మంచి రేస్పోన్స్ వస్తుంది. దిల్ రాజు తొలి సారి తమిళంలో స్టార్ హీరో విజయ్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రిచ్ గా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

తెలుగులో ఇదే మూవీని ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ నుంచి ముందు తమిళ వెర్షన్.. ఆ తరువాతే తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తూ వస్తున్నారు. రష్మిక మండన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *