ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘డీజే టిల్లు’ సైలెంట్గా విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. నేహ శెట్టి హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ద్వార ప్రేక్షకులను ఎంతో అలరించింది. మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతో అలరిచాయి.

సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ గా చేస్తున్నారు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. అయితే ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈనేపథ్యంలో ఆమె వెళ్లడంపై క్లారిటీ ఇవ్వాలని కోరగా ఈ వివాదంపై హీరో త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు.

ఇక అత్యంత తక్కువ బడ్జెట్ తో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లని రాబట్టడంతో ఒక్కసారిగా సిద్దూ జొన్నలగడ్డ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు దర్శకుడు విమల్ కృష్ణే అయినా క్రెడిట్ మొత్తం సిద్దూ జొన్నలగడ్డకే దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *