ఫిదా సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైంది సాయి పల్లవి (Sai Pallavi ). మలయాళ సినిమా పరిశ్రమ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఆమె తెలుగులో కూడా సినిమాలు చేయడం ఆమె అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. అలా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు లో ఆమెకు మరిన్ని సినిమాలు వచ్చాయి.

అయితే ఆమె చేసిన శ్యామ్ సింగ రాయ్ (Shyam Singa Roy) సినిమా తర్వాత తెలుగు లో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. తెలుగు మాత్రమే కాదు మలయాళం లో కూడా ఆమె సినిమాలు చెయ్యట్లేదు. దానికి కారణం ఏంటో అని అందరు తెగ కలవరపడుతున్నారు.

మంచి నటి సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటా అని అందరు ఆరాధిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె సినిమా లకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పబోతుందని తెలుస్తుంది. చాలా రోజుల నుంచి ఇది వినిపిస్తున్నా ఇప్పుడు దాదాపుగా ఇదే నిజం అని చెప్తున్నారు.

అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే సాయి పల్లవి తన స్వస్థలం కోయం బత్తూరు (coimbatore) లో ఓ హాస్పిటల్ ని నిర్మించాలనుకుంటుందట. అక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన చేస్తుందట. అందుకే ఆమె సినిమాలకు పూర్తిగా దూరం గా ఉండాలని నిర్ణయించుకుందట. ఇక ఆమె శివ కార్తికేయన్ (Shivakarthikeyan) సినిమా లో చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *