టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందాన (Rashmikamandana) ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ అని చెప్పాలి. ఆమెకు డిమాండ్ భారీ స్థాయి లో ఉండడంతో అన్ని భాషల హీరో లు ఆమె ను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దళపతి (Vijaydalapathy) హీరో గా నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అది సంక్రాంతి కి విడుదల కాబోతుంది. అంతేకాదు సంచలన విజయం అందుకున్న పుష్ప (Pushpa) సినిమా రెండో భాగంలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవల్లి (Srivalli) గా ఆమె ఈ సినిమా లో ఏ స్థాయి లో నటించిందో అందరికి తెలిసిందే. ఆమెకు నేషనల్ కష్ గా పేరొచ్చింది ఈ సినిమా తోనే అని చెప్పాలి.

టాప్ ప్రాజెక్ట్ లు చేస్తున్న రష్మిక ఇప్పుడు కోట్ల లో పారితోషకం తీసుకుంటుండగా ఇప్పుడు ఆమె ఓ ఐటెం సాంగ్ లో నటిస్తుంది అని వార్తలు రావడం విశేషం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో లో రాబోతున్న సినిమా లో ఐటెం సాంగ్ ఉండబోతుంది అని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఐటెం సాంగ్ కోసం ఏ బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ ను ఎంపిక చేస్తారని అందరు అనుకున్నారు కానీ రష్మిక ఈ పాటలో స్టెప్పులేయబోతుందని చెబుతున్నారు. ఇటీవలే అగ్ర హీరోయిన్ లు ఐటెం సాంగ్ లు చేయడం లో ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో రష్మిక ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందా అనేది తెలియాల్సి ఉంది. సమంత, కాజల్ వంటి హీరోయిన్ టాప్ హీరోయిన్ లు గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్ లు చేసి అందరిని అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *