గత కొన్ని రోజులుగా ప్రభాస్ (Prabhas) పెళ్లి గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ కృతి సనన్ (Krithi Sanon) తో అయన పెళ్లి జరగబోతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె నటించిన తోడేలు సినిమా ఇటీవలే తెలుగు లో విడుదల కాగా దానికి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ రకమైన పుకార్లు ఎక్కువయ్యాయి.

ఆ తర్వాత హీరో వరుణ్ ధావన్ (varun Dhawan) కూడా కొన్ని ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం, కృతి సనన్ ప్రభాస్ ను ఉద్దేశించి మాట్లాడం అందరికి హింట్స్ లాగా అనిపించాయి. దాంతో ఇదే నిజమని సోషల్ మీడియా లో ట్రెండీ కూడా చేశారు. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి మేటర్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంది.

గతంలో అనుష్క తో అయన పెళ్లి జరగబోతుందని అన్నారు. కానీ అది ఒట్టి పుకారు అని తేలింది. ఇప్పుడు ఈ విషయాన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభాస్ ఏమని స్పందిస్తారో చూడాలి. ఇక ఇప్పుడు ఆది పురుష్ సినిమా తర్వాత వీరి పెళ్లి జరగనుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా లో ప్రభాస్ తో కలిసి కృతి సనన్ నటించింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమైన కృతి కి ఈ విధమైన రూమర్స్ రావడం కొత్తేమీ కాకపోయినా పెళ్లి వరకు వెళ్లడం ఎంతవరకు తీసుకోగలుగుతుంది అనేది చూడాలి. ఇకపోతే ఈ ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది జూన్ లో విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *