తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా యమలీల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోగా నటించి ఒక్క సారిగా తన మీద ఉన్న అంచనాలను మార్చేశారు. ఇక ఈయన సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

అలాగే ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గానే కాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే షో ద్వారా చాలామంది ఇండస్ట్రీలో కనుమరుగైన నటులను తీసుకువచ్చి వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడతారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా అలీ తన పెద్ద కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేశారు. ఇక ఈయన కూతురు ఫాతిమా పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు కూడా పెళ్లిలో సందడి చేశారు.

అంతేకాదు చిరంజీవి నాగార్జునలు వారి కుటుంబంతో సహా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక నాగార్జున చిరంజీవి కుటుంబాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అలీ తన కూతురు పెళ్లిలో వ్యవహరించిన తీరు ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అలీ ఏంటి ఇలా ప్రవర్తించారు అంటూ ఈయన గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆలీ ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ తండ్రైనా తన కూతురు పెళ్లి చేస్తే కాస్త సంతోషంతో పాటు ఎంతో బాధలో ఉంటారు.

ఎందుకంటే అప్పటివరకు తన ఇంట్లో గారాబంగా పెరిగిన కూతురు మెట్టినింటికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని ఏ తండ్రైనా కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలీ మొహంలో మాత్రం అలాంటి బాధ ఎక్కడ కనిపించలేదు. ఇక ఈ విషయంలో చాలా మంది నెటిజన్స్ ఆలీ ఎందుకు ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.ఇక కొంతమంది మాత్రం తన కూతురి అత్తింటి వాళ్ల మీద ఉ న్న నమ్మకంతోనే అలీ పెళ్లిలో అంత సంతోషంగా ఉన్నారు అంటూ భావిస్తున్నారు.ఇక ఏది ఏమైనాప్పటికీ ఆలీ తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా కన్నుల పండగుగా చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *