తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన హీరోయిన్లలో సమంత (SAMANTHA)కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దశాబ్ద కాలం నుంచి ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు కానీ సమంత అందం,నటనలో ఏ మాత్రం తగ్గుదలలేదని చెప్పవచ్చు. అలాంటి సమంత ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఎంత ఎదిగిన ఎంత బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది..

తన గురించి ప్రతి అప్డేట్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. పాపం ఈ అమ్మడు ఈ మధ్యకాలంలోనే మయోసైటిస్ (MAYOSITIS)అనే మాయదారి వ్యాధి బారిన పడింది.. సమంత కు ఉన్న వ్యాధి ప్రస్తుతం థర్డ్ స్టేజిలో ఉందట.. అయితే ఈ వ్యాధికి మందులేవి లేవని ధనిక దేశాల మందులు వాడుతున్నా నయం కావడం లేదని తెలుస్తోంది. దీంతో సమంత ఈ వ్యాధి నుంచి ఎలాగైనా బయటపడాలని దక్షిణ కొరియా వెళ్లిందట.. ప్రస్తుతం ఉన్న ఆ మందులను ఆపేసి పూర్తిగా ఆయుర్వేదిక్ మందుల వాడాలని ఆమె డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

దక్షిణ కొరియా(SOUTH KORIA) దేశంలో దీనికి చికిత్స దొరుకుతుందని అక్కడికి వెళ్తే కోలుకునే అవకాశం ఉందని సమంత భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అయితే ఆమె దక్షిణ కొరియా వెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు.కానీ ఆమెతోపాటు నాగ చైతన్య కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితిని సమంత నాగచైతన్యకి ఇప్పటికే వివరించిందని, అప్పటినుంచి చైతన్య ఆమెపై కేర్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా నాగచైతన్య సమంతతో దక్షిణ కొరియాకు వెళ్తున్నట్టు సన్నిహిత వర్గాల వస్తున్న సమాచారం..

సమంతకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నాగచైతన్య(NAGACHAITHANYA) కాబట్టి ఆయన ఉంటే ఆమె తొందరగా కోలుకునే అవకాశం ఉందని అందుకే నాగచైతన్య కూడా దక్షిణ కొరియా వెళ్లడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.. ఈ విధంగా ఇద్దరు కలిసి దక్షిణ కొరియా వెళ్లారని సమాచారం. ఇద్దరూ వెళ్లినా కానీ వీరిద్దరు ఉన్నటువంటి ఏ ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. ఏది ఏమైనా అందాల సమంత ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *