అప్పట్లో తన నటనతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నటి మీనా అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత విద్యాసాగర్ రావు (vidyasagar rao)ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఒక పాప పుట్టాక మళ్ళీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాల వల్ల మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇక భర్త చనిపోయాక మీనా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చాలామంది ఆమెను ఆ బాధ నుండి బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుండి కోలుకుంటున్న టైంలో ఈమె మీద మరో షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే.. మీనా(meena) రెండో పెళ్లి చేసుకోబోతుందని.. మీనా భర్త చనిపోవడంతో కూతురు నాన్న లేకుండా పెరగకూడదు అనే ఉద్దేశంతో తన ఇంటికి రోజు వచ్చే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట.

అలాగే ఆ వ్యక్తి అంటే తన కూతురు కూడా చాలా ఇష్టం.. ఎప్పుడు అంకుల్ అంకుల్ అని పిలుస్తుందట. అలాగే మీనా తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లి చేసుకోమని ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె రెండో పెళ్లి(second marraige)కి ఒప్పుకుందట. అలాగే తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో మీనా గురించి తమ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే.. మీనా అసలు ఏ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు..

ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా అఫీషియల్ గా ప్రకటిస్తుంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చే వార్తలన్నీ రూమర్సే. కేవలం ఆమె మీద ఏదో ఒకటి రూమర్ పుట్టించాలని ఇలాంటివి చెబుతున్నారు. అసలు మీనా రెండో పెళ్లి విషయంలో ఎలాంటి వాస్తవం లేదు.. అంటూ మీనా సన్నిహితులు రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చే వార్తలను ఖండిస్తున్నారు. ఇక ఈ వార్తలు ఆగాలంటే కచ్చితంగా మీనా స్పందించాల్సిందే.

https://youtu.be/KbYYOkMdS18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *