తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలా సినిమాలలో విలన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు గురించీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈయన విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి ఎన్నో పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక బ్యాంకు ఉద్యోగిగా పని చేసేవాడు. కానీ సినిమాల మీద మక్కువ ఎక్కువ ఉండటంతో కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ ఉండేవాడు.

అలా అంచలంచెలు ఎదుగుతూ సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాడు. తర్వాత ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాడు. అంతేకాకుండా ఆయన సౌత్ భాషలలో కూడా నటించాడు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాలకు దూరమయ్యాడు. అయితే ఈమధ్య కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆయన సినిమా కెరీర్ విషయాలను ప్రేక్షకులకు వెల్లడిస్తున్నారు. కోట గారు మనసులో ఏది ఉంచుకునే వారు కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషి ఇలా మాట్లాడటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు కోటా శ్రీనివాసరావు.

అయితే ఆయన తన ప్రవర్తన వల్ల ఏనాడు తనకు సినిమా అవకాశాలు తగ్గలేదు అన్నారు. ఈయనకు ఒకే ఒక అలవాటు ఉండేది అదే డ్రింకింగ్ చేయటం.. కానీ ఏ రోజు షూటింగ్ కి డ్రింక్ చేసి వచ్చేవాడు కాదట. కేవలం బయట మాత్రమే తాగుతానని చెప్పారు. ఈ డ్రింకింగ్ విషయంలో చాలాసార్లు నన్ను చిరంజీవి గారు తిట్టేవారు. నువ్వు మంచి ఆర్టిస్ట్ వి అలాంటి నీకు ఇలాంటి అలవాటు ఎందుకు.. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు జాగ్రత్త అని చిరంజీవి చెప్పేవారట.

కోట గారి మీద చిరంజీవికి చాలా అభిమానం. కోట కొడుకు చనిపోయినప్పుడు చిరంజీవి గారు వచ్చి చాలా బాధపడ్డాడట. ఇప్పటికీ కూడా సీనియర్ నటులను చిరంజీవి పలకరిస్తూనే ఉంటాడు ఆయన మనసు చాలా గొప్పది అంటూ కోట చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *