సెప్టెంబర్ 27వ తేదీన ఆదివారం రోజు అంగరంగ వైభవంగా తెలుగు కమెడియన్ అలీ కూతురు పెళ్లి ఘనంగా జరిగింది. ఆ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో చిరంజీవి , నాగార్జున దంపతులతో పాటు రోజా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆలీకి ఉన్న క్రేజ్ చాలా వేరు అనే చెప్పాలి. చాలామంది సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర నటులు ఇలా అందరూ కూడా ఆలీకి బాగా పరిచయం. ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటారు . దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్న ఆలీ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం కూడా.

ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో జరిగిన తన కూతురు ఫాతిమా వివాహానికి.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, బ్రహ్మానందం , అల్లు అరవింద్ , నాని, త్రివిక్రమ్, సురేఖ, రోజా, అమల లాంటి చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు హాజరయ్యారు. కానీ తనకు ఎంతో ఆప్త మిత్రుడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు.. అయితే వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ప్రస్తుతం రాజకీయం అనే ఒక అడ్డుగీత దూరం చేసింది అని స్పష్టమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఆలీ కూతురు పెళ్లికి హాజరు కాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ ఆలీ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. గుడుంబా శంకర్ మొదలుకొని ఇటీవల వచ్చిన ఎన్నో సినిమాలలో కూడా పవన్ కళ్యాణ్ ఆలీకి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆలీ వైసీపీలో చేరడంతో పవన్ కళ్యాణ్ తో విభేదం ఏర్పడింది. అదే కాదు పవన్ కళ్యాణ్ ఆలీని కలవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదట. తన భార్య జుబేదాతో కలిసి పెళ్లి కార్డు ఇద్దామని పవన్ ఇంటికి వెళ్లినా సరే పవన్ కళ్యాణ్ ఆలీని కలవలేదట.

అందుకే పవన్ కళ్యాణ్ ఆలీ కూతురు పెళ్లికి హాజరు కాలేదు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరొకపక్క ఎంత ఆప్త మిత్రులైన వీరిద్దరిని రాజకీయాలే దూరం చేశాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *