నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా(rashmika mandanna) ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈ అమ్మడు ఓ స్టార్ హీరో పై మోజుతో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైందట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవ‌రో కాదు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. గతంలో మహేష్ బాబు-రష్మిక జంటగా `సరిలేరు నీకెవ్వరు` సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదలై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా సమయంలోనే మహేష్-రష్మికల మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది.

ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో `ఎస్ఎస్ఎంబీ 28(ssmb28)` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట‌ బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ ప్రారంభించే లోపే మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరా దేవి మరణించడంతో.. `ఎస్ఎస్ఎంబీ 28` షూటింగ్ ను కొద్ది రోజులు వాయిదా వేశారు.

అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ సైతం షూటింగ్ లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ రెండో వారం నుంచి సెకండ్ షెడ్యూల్ ను షురూ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండబోతుందని గత కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆ ఐటెం సాంగ్ కోసం త్రివిక్రమ్(trivikram) తాజాగా రష్మికను సంప్రదించారట. ఇక మహేష్ తో ఉన్న సన్నిహిత్యం నేపథ్యంలో వెంటనే ఐటమ్ సాంగ్ చేసేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

మరి టాక్ ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ రష్మిక అభిమానులు మాత్రం ఐటెం సాంగ్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. హీరోయిన్‌గా కెరీర్ ఫుల్ స్వింగ్‌ లో దూసుకుపోతున్న త‌రుణంలో ఐటమ్ సాంగ్స్‌ నీకు అవసరమా అంటూ సూచనలు చేస్తున్నారు. కాగా, రష్మిక సినిమాల విషయానికి వ‌స్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప 2(pushpa 2)` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో విజ‌య్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన `వారసుడు` వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగబోతోంది. మరోవైపు బాలీవుడ్లో మూడు నాలుగు చిత్రాల‌కు ఈ బ్యూటీ సైన్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *