కోలీవుడ్ ప్రేమ జంట హీరో గౌతమ్ కార్తిక్, హీరోయిన్ మంజిమ మోహన్ లు ఒక్కటయ్యారు. గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న వీరు నిన్న పెద్ద ల సమక్షంలో పెళ్లి చేసుకుని సంసారం జీవితంలోకి అడుగుపెట్టారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు విచ్చేసి వీరిని ఆశీర్వదించారు.

ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. కాగా ఈ పెళ్ళికి సంబంధించి కొన్ని ఫోట్లు వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎంతో హల్చల్ అవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో ఇద్దరు చిరునవ్వులు వొలికిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లు సైతం వీరికి అభినందనలు తెలుపుతున్నారు.

గౌతమ్ కార్తిక్ , మంజిమ మోహన్ ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మణిరత్నం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కడలి సినిమా ద్వారా గౌతమ్ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత అయన తమిళంలో పలు ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాయి.

కార్తిక్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన గౌతమ్ కార్తిక్ ఇప్పుడు అక్కడ సక్సెస్ ఫుల్ హీరో గా ఉన్నాడు. ఇక మంజిమ నాగ చైతన్య హీరో గా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు తెలుగు లోకి దబ్ కాగా అవి సూపర్ హిట్ అయ్యి. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *