ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతలలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజ్(Dilraju) ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి ప్రత్యేకమైన స్టార్ డం సంపాదించుకున్నారు దిల్ రాజ్..

అలాంటి దిల్ రాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2017లో ఆయన ఫస్ట్ వైఫ్ అనిత(Anitha) హార్ట్ స్ట్రోక్ తో కన్ను మూసింది. దీంతో కృంగిపోయిన దిల్ రాజ్ చాలా రోజులు డిప్రెషన్ కి గురయ్యారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు నరకయాతన అనుభవించారు. మొదటి భార్యను మర్చిపోలేక అనేక ఆపసోపాలు పడ్డారట.

అలాంటి దిల్ రాజ్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భార్య అనిత మరణించాక రెండు సంవత్సరాల పాటు ఇబ్బందుల పాలయ్యానని, ఆ సమయంలో నా అల్లుడు నా కూతురే నాకు తోడు నీడ అయ్యారని, ఆ బాధ నుంచి తెరుకోవడానికి చాలా ప్రయత్నించానని అన్నారు. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాబ్లింగ్.. నన్ను ఆ విధంగా చూస్తూ మా తల్లిదండ్రులు ఉండలేకపోయారు.. వారంతా కలిసి నన్ను రెండో పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేశారని చెప్పారు .

అంతేకాకుండా నా కూతురు హన్సితా కూడా నన్ను పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి చేసింది.. ఇంతమందిని బాధ పెడుతూ ఇలా ఉండడం ఎందుకని ఆలోచించి రెండో పెళ్లికి ఒకే చెప్పానని దిల్ రాజ్ అన్నారు. దీంతో 2020లో తేజస్విని(Tejaswini)ని రెండో వివాహం చేసుకున్నానని చెప్పారు. ఇటీవల ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *