ఒక చిన్న డిస్టిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దిల్ రాజు(dil raju) 2020 డిసెంబర్ ఆఖరిలో తేజస్విని(వైఘా రెడ్డి) అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో అతి కొద్ది మంది స‌మ‌క్షంలో ఈయ‌న వివాహం జ‌రిగింది. రెండో వివాహం స‌మ‌యానికి దిల్ రాజు వ‌య‌సు 49 ఏళ్లు.

అప్ప‌ట్లో దిల్ రాజు రెండో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొంద‌రు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సైతం గుప్పించారు. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా దిల్ రాజు త‌న భార్య తేజ‌స్వినితో చ‌క్క‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ దంప‌తుల‌కు ఓ బాబు కూడా జ‌న్మించాడు. అయితే దిల్ రాజు మొదటి భార్య అనిత(Anitha) అనారోగ్యంతో 2017లో మరణించింది. ఈ దంపతులకు హర్షిత రెడ్డి అనే కూతురు ఉంది.

అనిత మరణం తర్వాత దిల్ రాజు దాదాపు రెండేళ్లు ఒంటరిగానే ఉన్నాడు. తండ్రి ఒంటరితనాన్ని చూసి భరించలేక హర్షిత రెడ్డి(Hanshita Reddy) స్వయంగా దిల్ రాజుకు రెండో వివాహం చేసిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అసలు నిజం ఏంటి..? తాను ఎందుకు రెండు వివాహం చేసుకున్నాను..? అన్న విషయాల‌పై దిల్ రాజు ఎట్టకేలకు గుట్టు విప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. త‌న రెండో వివాహం గురించి ప్ర‌స్తావించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. `అనారోగ్యంతో అనిత మరణించిన తర్వాత రెండేళ్ల పాటు బాగా ఇబ్బంది పడ్డా. ఎన్నో స్ట్రగల్స్ ను ఫేస్ చేశా. ఆమె మరణించిన తర్వాత కూతురు, అల్లుడు నాతోనే ఉన్నారు. నా బాధ‌ను పోగొట్టేందుకు వాళ్లు ఎంతో ప్ర‌య‌త్నించారు. అయితే నాకున్న ఒకే ఒక్క వ్యాపకం గ్యాంబ్లింగ్. న‌న్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండ‌లేక‌పోయారు. రెండు పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టు ప‌ట్టారు. వారికి నా కూతురు స‌పోర్ట్ చేసింది. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బాగా ఒత్తిడి చేశారు. అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నా. త‌న‌ది హైదరాబాదే. నా కుటుంబం.. ప్రొఫెషన్ డిస్ట్రబ్ కావొద్దని ఆవిడను అన్ని విధాలుగా ప్రిపేర్ చేసి పెళ్లాడాను. ఈ మధ్యనే మాకో బాబు పుట్టాడు. ఇద్దరు భార్యల పేర్లు వచ్చేలా అన్వయి అన్న పేరు పెట్టాం` అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *