గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న నట‌సింహ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna).. `ఆఖండ` సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగ‌తి తెలిసిందే. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు.

ఇందులో బాలయ్యకు జోడిగా శ్రుతి హాసన్(shruti haasan) నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే మెల్లమెల్లగా ప్రచార కార్యక్రమాల‌ను సైతం షురూ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు బాలయ్య అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ఇంత‌కు ముందు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు అన్న టాక్ ఉంది. కానీ అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం బాలయ్య తన రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశారట. ఇందులో భాగంగానే `వీర సింహారెడ్డి(veera simha reddy)`కి ఆయన రూ. 15 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరి ఈ ప్రచారమే నిజమైతే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోల్లో బాలయ్య సైతం ఒకరవుతారు. కాగా, `వీర‌ సింహారెడ్డి` అనంతరం బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్(shine screens banner) పై సాహో గారపాటి నిర్మించనున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కనిపించబోతోంది. వీర సింహారెడ్డి విడుదల అనంతరం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *