ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే మ‌ల‌యాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప 2(pushpa 2)` రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మొదటి భాగానికి భారీ ఎత్తున రెస్పాన్స్ రావడంతో.. రెండో భాగాన్ని అంతకుమించి అనేంతలా సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. రెగ్యుల‌ర్‌ షూటింగ్ సైతం ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో బన్నీ సతీమణి, అల్లు వారి కోడలు స్నేహ రెడ్డి నటించబోతోందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుందట, ఆ పాత్ర నిడివి చిన్నదే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందట. ఆ పాత్ర కోసం సుకుమార్ ఎవరిని తీసుకోవాలని సెర్చ్ చేస్తుండగా.. బ‌న్నీ స్వయంగా తన భార్యను రికమెండ్ చేశాడట. స్నేహ రెడ్డికి ఎప్పటి నుంచో నటనపై మక్కువ ఉందట. ఈ నేపథ్యంలోనే బన్నీ తన భార్య పేరు సుకుమార్(sukumar) కు సూచించాడట. దాంతో సుకుమార్ స్నేహారెడ్డిని ఆ పాత్ర కోసం ఫైనల్ చేశాడ‌ని, భ‌ర్త రిక‌మెండ్ తో స్నేహా బంప‌ర్ ఛాన్స్ కొట్టేసింద‌ని నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ ప్రచారంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా అల్లు ఫ్యాన్స్ మాత్రం ఫుల్‌ ఖుషి అయిపోతున్నారు. అయితే మరోవైపు మాత్రం ఈ ప్రచారం కేవలం పుకారే అంటూ తేల్చేస్తున్నారు. మరి ఏది నిజం అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇటీవల స్నేహ రెడ్డి(sneha reddy) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గ్లామ‌ర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్ర‌కారును తెగ క‌వ్విస్తోంది. ఇంతవరకు ఏ టాలీవుడ్ హీరో సతీమణి కూడా ఈ స్థాయిలో గ్లామర్ షో చేసిందో లేదు. కానీ స్నేహా రెడ్డి మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తునడంతో.. ఆమెపై కొందరు నెటిజ‌న్లు విమర్శలు కూడా కురిపించారు. అయితే కొందరు నెటిజ‌న్లు మాత్రం ఆమెకు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *