సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు ఎలా టాప్ రేంజ్ కి వెళ్ళాము అనేదే ముఖ్యం అని చెబుతున్నారు కొంతమంది హీరోయిన్ లు. బుల్లితెర ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటివారిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నయనతార (Nayantara) హీరోయిన్ గా పరిచయమవ్వడానికి ముందు సీరియల్స్ లో నటించింది.యాంకర్ గా కూడా చేసింది. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియా లోనే టాప్ హీరోయిన్. సాయి పల్లవి కూడా ఢీ షో లో డాన్సర్ గా చేసిన విషయం చాలామందికి తెలుసు. అక్కడ తన ప్రతిభను చాటుకున్న సాయి పల్లవి (Sai pallavi) ఆ తర్వాత మలయాళ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయమైంది. ఇప్పుడు తెలుగు లో కూడా టాప్ హీరోయిన్ సాయి పల్లవి.

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా మొదటగా సీరియల్స్ లోనే నటించింది. ఆమె తల్లి కూడా నటి కావడంతో హీరోయిన్ గా ఆమె ఎదిగింది. ఇక మరో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఓ మలయాళ ఛానల్ లో యాంకర్ గా తెరంగేట్రం చేసింది. అంతకు ముందు బాలనటిగా కూడా చేసింది. ఆమె ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహం చేసుకుంది.

ఇక ఇటీవలే తెలుగు లో సూపర్ హిట్ అయిన సినిమా సీతారామం లో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) కూడా టీవీ లో పరిచయమైంది. కుంకుమ భాగ్య అనే సీరియల్ లో చేసిన ఈమెకు మంచి పేరు రాగా ఇప్పుడు ఆమె తెలుగు లో మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *