Aaditi Agarwal Profile, Affairs, Contacts, Boyfriend, Gallery, News, Hd Images wikiపిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులను చూసాం.. కానీ పిల్లలనే తమ భవిష్యత్తుగా మార్చుకొని వారి చేత డబ్బు సంపాదించుకునే తల్లిదండ్రులు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ తండ్రి కూడా ఒకరు. డబ్బు కోసమే కూతుర్ని కన్నాను అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఇతరులకు కూడా మరింత అసహ్యాన్ని కలుగజేస్తుంది. డబ్బు కోసం.. తన విలాసవంతమైన జీవితం కోసం కూతురు జీవితంతో ఆడుకున్నాడు. డబ్బు కోసం చివరికి తన కూతురు చావుకు కూడా కారణమయ్యాడు. ఆ కూతురు ఎవరో కాదు సినీ ఇండస్ట్రీ మెచ్చిన స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్. డబ్బు కోసం ఆర్తి అగర్వాల్ ను విపరీతంగా శారీరకంగా హింసించే వాడట.

ఇప్పటికే ఈమె మరణం పై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. కానీ మరుగున పడిన కొన్ని విషయాలు మాత్రం మరింత ఆశ్చర్యాన్ని కలగజేస్తున్నాయి. స్టార్ హీరోయిన్గా నువ్వు నాకు నచ్చావు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత అగ్ర హీరోలతో నటించి మరింత సంపాదించుకుంది. సినిమాలలో ఉన్నత స్థానానికి ఎదిగిన ఆర్తి అగర్వాల్ కుటుంబం విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంది. సినిమాలలోని విలన్లని చూస్తూ ఉంటాం.. కానీ ఆ విలన్లు నిజజీవితంలో తల్లిదండ్రుల రూపంలో వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్తి అగర్వాల్ ను కేవలం డబ్బు కోసమే సినిమాలోకి దింపాడు ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్. తండ్రి బలవంతం మీద ఇండస్ట్రీలోకి వచ్చిన ఆర్తి అగర్వాల్ మొదట్లో సక్సెస్ అయిన ఆ తర్వాత బొద్దుగా ఉండడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే కూతురు వృత్తిని వ్యాపారంగా మార్చుకున్న ఆయనకు ఈ విషయం మింగుడు పడలేదు..అయితే శశాంక్ అగర్వాల్ ఎంత దిగజారాడు అంటే రోజుకు ఆమె రేటును ఫిక్స్ చేసి మూడవ గ్రేడు చిత్రాలలో నటించమని బలవంతం కూడా చేసే వాడట. అంతేకాదు వినకపోతే ఆమెను శారీరకంగా మరింత వేధింపులకు గురి చేసేవాడట.

ఇంటిలో పని వాళ్ళ ముందు కూడా ఆర్తి అగర్వాల్ విపరీతంగా కొట్టేవాడట.. చెప్పిన దాన్ని అంగీకరించకపోతే విచక్షణారహితంగా ఆమెను కొట్టడం వల్లే ఒకసారి కోమాలోకి వెళ్లిందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తండ్రి పెట్టే టార్చర్ భరించలేక అమెరికాలోని సాఫ్ట్వేర్ ను వివాహం చేసుకుంది.. అయినా కూడా తండ్రి వేధింపులు ఆగలేదు. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి భర్తకు విడాకులు ఇప్పించి మళ్లీ నటించమని ఆమెను బలవంతం చేశాడట. బరువు తగ్గడం కోసం చికిత్స శాస్త్ర చికిత్స చేయించుకోవడంతో అది వికటించి ఎట్టకేలకి ఈమె స్వర్గస్తురాలు అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *