మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవమానాలను ఎదుర్కొని వాటిని దాటుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈయన ఏలారు అంటే ఆయన డెడికేషన్ అప్పట్లో ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు ఆరు పదుల వయసు దాటినా కూడా స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

ఇక ఈయన వారసుడిగా రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటే ఈయన కూతుర్లు మాత్రం ఈయన తెచ్చుకున్న పేరును మొత్తం నాశనం చేస్తున్నారు. చిన్న కూతురు శ్రీజ(sreeja) మొదట తన స్నేహితున్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇక ఆ తర్వాత శ్రీజ కు చిరంజీవి తన దగ్గరి బంధువైన కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి పెళ్లి చేశాడు. శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య కూడా ఏవో గొడవలు అయ్యి వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇక వార్తలకు తగ్గట్టుగానే వీరు కూడా వేరువేరుగా ఉంటూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చారు.

అంతేకాదు త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే కళ్యాణ్ దేవ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ అల్లుడుగా కళ్యాణ్ దేవ్ విజేత (vijetha)అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కళ్యాణ్ దేవ్ కి సినిమాల్లో నటించాలి అనే ఆసక్తి లేదట. కానీ చిరంజీవి తన అల్లుడులో ఉన్న టాలెంట్ చూసి హీరో లక్షణాలు ఉన్నాయని చెప్పి సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారట. అయితే కళ్యాణ్ దేవ్ కి దేశ విదేశాల్లో ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి ఆ బిజినెస్ లలో కోట్ల టర్నోవర్స్ కూడా ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వారికి వందలకోట్ల ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఇక కళ్యాణ్ దేవ్ కి కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన కాళ్ళ మీద తాను బతకాలి అనుకొని టెక్నాలజీ,బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసి కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేశారు. అలాగే కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీకి ఒక చిత్తూరులోనే ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయంటే అతను ఎంత కోటిష్వరుడో అర్ధం చేసుకోవచ్చు.అయితే కళ్యాణ్ దేవ్ (kalyan dev)మెగా ఇంటి అల్లుడు కాకముందు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే మెగా ఇంట్లో అడుగు పెట్టాడో అప్పటినుండి కళ్యాణ్ దేవ్ అందరికీ సుపరిచితమయ్యాడు. అలాగే తన మామ సపోర్టుతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *