తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తన కృషి పట్టుదలతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి(chiranjeevi). ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను తట్టుకొని స్టార్ హీరో రేంజ్ కి వచ్చారు. ఇక ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు.ఇక చిరంజీవి ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాతో అభిమానులను పలకరించాడు. ఇక ఈ సినిమా మొదట హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లు తగ్గాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి తన పెద్దకూతురు సుస్మితను చెన్నైలో టాప్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు.చెన్నై లో సుస్మిత(susmitha) అత్తింటి వాళ్ళు మంచి పేరున్న బిజినెస్మేన్ కుటుంబం. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ తాతగారు L.V రామారావు అంటే అప్పట్లో చెన్నైలోనే టాప్ బిజినెస్ మాన్. కేవలం చెన్నైలోనే కాకుండా అమెరికా, జపాన్, థాయిలాండ్,సింగపూర్ వంటి విదేశాలలో కూడా వీళ్లకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి.

ఇక సుస్మిత వాళ్ళ అత్తగారిది రాయలసీమ అయినప్పటికీ వ్యాపార రీత్యా తమిళనాడు కి వెళ్లి అక్కడే చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇక సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ (vishnu prasad)విదేశాల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసి చదువు పూర్తయ్యాక వాళ్ల తండ్రి బిజినెస్ లు చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆయన తాతయ్య స్టార్ట్ చేసిన పామాయిల్ బిజినెస్ విష్ణు ప్రసాద్ తండ్రి చేతిలోకి వచ్చాక బాగా డెవలప్ అయింది. ఇక ఆ బిజినెస్ ని విష్ణుప్రసాద్ మొదలెట్టాక ఆ బిజినెస్ రెట్టింపు అయింది.

వీళ్ళ ఫ్యామిలీ నే ప్రపంచంలోని చాలా దేశాలకు మేలు రకం పామాయిల్ ని ఎగుమతి చేస్తుంది. ఇక వీళ్లకు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు సమాచారం. సుస్మిత విష్ణు ప్రసాద్ కి ఇద్దరూ కూతుర్లు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో సుస్మిత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్(ram chharan) కి, చిరంజీవికి స్టైలిష్ గా వ్యవహరిస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న ఆసక్తి చూసి సుస్మిత భర్త ఆమెను చాలా ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీలోకి పంపించారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *