సోషల్ మీడియా లో వచ్చే వార్తలకు ఎలాంటి అధరాలు లేకపోయినా అవి ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ప్రభాస్ హీరో గా నటిస్తున్న సలార్ సినిమా లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అంటూ ఓ వార్త ప్రచారం అవుతుంది. ఇందులో ఎలాంటి నిజం లేదని దేవరకొండ కాంపౌండ్ నుండి వినపడుతుంది.

ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ షెడ్యూల్ గ్యాప్ లో ముంబై కి ఓ యాడ్ షూట్ కి వెళ్ళాడు. ఈ విషయం సోషల్ మీడియా లో హల్చల్ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో ఆ యాడ్ షూట్ లొకేషన్ లో దిగిన ఓ ఫోటో చూసి సలార్ లో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అని అనుకుంటున్నారు.

వాస్తవానికి సలార్ లో ప్రభాస్ లుక్ కి, విజయ్ దేవరకొండ లుక్ పెద్ద పోలికలేమీ లేవు. అదే రగ్డ్ స్టైల్ లో విజయ్ లుక్ కూడా కనిపించింది. ఆ విధంగా అభిమానులు రౌడీ స్టార్ కూడా ఈ సినిమా లో నటిస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు విక్రమ్ సినిమా లో సూర్య రోలెక్స్ పాత్ర లాగా ఒక ఎక్ట్రార్డినరీ రోల్ చేస్తున్నాడని, అది పార్ట్ 2 కి లీడ్ గా ఉండబోతుందని కూడా అంటున్నారు.

ఏదేమైనా ఇద్దరి హీరో ల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి ఇప్పటివరకైతే ఇది రూమర్ అనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత చేయబోయే సినిమాలకు సంబంధించి త్వరలోనే ఓ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి తో సినిమా దాదాపు ఒకే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే టైం లో ఓ బాలీవుడ్ సినిమా కూడా చేసే విధంగా విజయ్ అడుగులు వేస్తున్నాడు. వచ్చే ఏడాది కొత్త సినిమా ను మొదలుపెట్టబోతున్నారు. ఇక ఖుషి సినిమా కూడా డిసెంబర్ మొదటి వారంలో తిరిగి మొదలు కాబోతుంది.

0 thoughts on “సలార్2 లో విజయ్ దేవరకొండ.. దీనమ్మ బొమ్మ అదిరిపోద్ది!!”
  1. Write more, thats all I have to say. Literally, it seems as
    though you relied on the video to make your point.

    You clearly know what youre talking about, why waste your intelligence on just posting videos to your blog when you could be giving us something
    enlightening to read?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *