కోలీవుడ్ హీరో విజయ్ దళపతి గురించి ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా కూడా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా తమిళ్ పరిశ్రమలో టాప్ ఫైవ్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన .. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా హీరో ప్రభాస్ తో సమానంగా పారితోషకం తీసుకుంటున్నారు.

Vijay: తండ్రి, కొడుకుల మ‌ధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళ‌న‌లో విజ‌య్ ఫ్యాన్స్

మరి ముఖ్యంగా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున హడావిడి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు ఫ్యాన్ వార్ తో రాష్ట్ర ప్రజలు భయపడతారు అన్న భయంతో థియేటర్ల వద్ద పోలీసు సిబ్బంది రక్షణ కూడా కల్పిస్తూ ఉంటారు. అంతలా తన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు విజయ్ దళపతి. ఇదిలా ఉండగా ఈయన తండ్రి నటుడే అయినా సొంత టాలెంట్ తో పైకి వచ్చారు విజయ్.

గత కొన్ని సంవత్సరాలుగా తన తండ్రితో విజయ గొడవ పడుతున్నారు అని, ఇద్దరు మాట్లాడుకోరని, ఒకే చోట కలిసి ఉండరని మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్న విషయం తెలిసిందే..అయితే విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ఇమేజ్ కోసం విజయ్ ఇమేజ్ను వాడుకుంటుండడంతో అతడికి కోపం వచ్చి తండ్రితో మాట్లాడడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విజయ్ కెరియర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.. విమర్శలు ఎదుర్కొన్నాడు.. అన్నింటినీ తట్టుకొని ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు ..ఒకప్పుడు చంద్రశేఖర్ కొడుకు విజయ్ అనే వారు.. కానీ ఇప్పుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ అంటున్నారు. కొడుకు ఎదుగుదల చూసి గర్వంగా ఉంది అంటూ తెలిపాడు.

ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. అలాగే మా కుటుంబంలో కూడా చిన్నపాటి గొడవలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నా.. వాటిని మేము ఏ రోజు పట్టించుకోలేదు.. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి నేను , విజయ్ రోజు కలుస్తూనే ఉంటాము. నాకు ఎంత కోపం వచ్చినా అతడు నా కొడుకే కదా! విజయ్ ఎప్పుడు బాగుండాలని దేవున్ని నేను కోరుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు చంద్రశేఖర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *