సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశం లభిస్తే చాలు అనుకొని.. ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పాత్ర దొరికితే చాలు అన్నట్టుగా విలన్ పాత్రలకు కూడా ఒకే చెప్పి మొదట ఇండస్ట్రీలోకి వచ్చీ.. ఆ తర్వాత తమ నటనతో స్టార్ హీరోలుగా మెప్పించిన నటులు కూడా చాలామంది ఉన్నారు.. నిజానికి ఏ సినిమా కైనా సరే… హీరో ఎంత ప్రాముఖ్యమో.. విలన్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా విలన్ లేకుంటే హీరోనే లేడు.. విలన్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరోని అంత ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి హీరో పాత్రతో పోల్చుకుంటే విలన్ పాత్రకే ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విలన్ పాత్రలు కొంతమంది కెరియర్ గ్రాఫ్ నే మార్చేశాయి.

మొదటగా ఇండస్ట్రీలోకి హీరో అవుదామని వచ్చి.. విలన్ పాత్రలతో సరిపెట్టుకొని ఆ తర్వాత స్టార్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్న అతి తక్కువ మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి:
చిరంజీవి బాడీ లోనే రిధం ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ముఖ్యంగా మాటలు.. మేనరిజం.. డాన్స్ అన్ని కూడా వేరే లెవెల్ అన్నట్టుగా ఉంటాయి. అయితే చిరంజీవి మొదటిసారి.. ఇది కథ కాదు , మోసగాడు, న్యాయం కావాలి వంటి చిత్రాలలో విలన్ గా నటించారు . ఆ తర్వాత మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

మోహన్ బాబు:
ఈయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొదమసింహం, సర్దార్ పాపారాయుడు , అడవిదొంగ వంటి చిత్రాలలో నెగిటివ్ పాత్రలు పోషించి.. ఆ తర్వాత కలెక్షన్ కింగ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

జెడి చక్రవర్తి:
గులాబి, ప్రేమకు వేళాయరా వంటి సినిమాలలో లవర్ బాయ్ గా కనిపించిన జెడి కూడా శివ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించాడు.

గోపీచంద్:
మ్యాచో మ్యాన్ గోపీచంద్ కూడా తొలివలపు సినిమాలో హీరోగా నటించినా అనుకున్న సక్సెస్ అవ్వకపోవడంతో విలన్ గా వర్షం, జయం, నిజం సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు..

రాజశేఖర్:
తలంబ్రాలు సినిమాలో విలన్ గా నటించి.. ఆ పాత్రకు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న రాజశేఖర్ ఆ తర్వాత హీరోగా సక్సెస్ పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *