టాలీవుడ్ లో ఎంత త్వరగా అయితే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారో అంతే త్వరగా బ్యాచ్లర్ లైఫ్ నుంచి వీడలేక పోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhash). ఇప్పటికే నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్నా.. వివాహానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే పలువురు అమ్మాయిలతో ఎఫైర్ ఉన్నట్టు.. లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అందులో ఏదీ కూడా నిజం కాలేకపోయింది. గతంలో వర్షం సినిమా సమయంలో హీరోయిన్ త్రిష (Trisha) తో ప్రభాస్ ప్రేమలో పడ్డాడు అని.. అయితే ఆ పెళ్లికి కృష్ణంరాజు అంగీకరించలేదు కాబట్టి వారిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కొంత కాలానికి హీరోయిన్ అనుష్క (Anushka) తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ.. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు.. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అయిన విషయం విధితమే.అయితే ఎట్టకేలకు ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా నమ్మడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి కృతి సనన్ తో హాజరయ్యి.. కృతి సనన్ – ప్రభాస్ల మధ్య ప్రేమ ఉందని స్పష్టం చేశాడు. దీంతో ఈ వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.

అయితే ఒకవైపు ప్రభాస్ , కృతి సనన్ ల పెళ్లి గురించి వార్తలు వినిపిస్తుంటే.. మరొకవైపు ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి.. ఈ కండిషన్ ఒప్పుకొని తీరాల్సిందే అని కుటుంబ సభ్యులు ఆయనకు ఒక అతిపెద్ద కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ గురించి తెలిసి అభిమానులు పూర్తిస్థాయిలో షాక్ లో మునిగిపోయారు. ఎట్టకేలకు ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆనందంలో ఉండగా.. ఇప్పుడు కుటుంబ సభ్యులు పెట్టిన కండిషన్ ని మరింత ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఆ కండిషన్ ఏమిటి.. అనే విషయానికి వస్తే.. కృష్ణంరాజు (Krishnamraju) మరణించిన తర్వాత ఆయన కుటుంబానికి కూడా ప్రభాస్ పెద్ద దిక్కు అయ్యాడు. కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లు ఇంకా అవివాహితులే కాబట్టి వారి ముగ్గురికి వివాహం చేసిన తర్వాతనే ప్రభాస్ వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కండిషన్ పెట్టారట.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా ప్రభాస్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *