ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. అటు తమిళ్ చిత్ర పరిశ్రమలో మహానటిగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో అమితాబ్ బచ్చన్ (Amitab bacchan) కూడా సావిత్రి నటనకు ఫిదా అయిపోయి.. అత్యంత సహజంగా.. గొప్పగా నటించే అతి తక్కువ మంది నటులలో ఒకరిగా సావిత్రిని బాగా ఆయన కొనియాడడం జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే బాగా పాపులారిటీని సొంతం చేసుకొని.. ఆ పాపులారిటీ నలు దిశలా వ్యాపించింది. తెలుగు, తమిళ్ చిత్రాలలో వరుసగా నటిస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్న మహానటి తెలుగులో దేవదాసు , అర్ధాంగి , మాయాబజార్ వంటి చిత్రాలను చూస్తే ఆమె ఎంత గొప్ప నటీమణి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు.

5. Savitri - Mahanati ( Great Actress ) - The Journey of a Legend

అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్న సావిత్రి ఎంతటి డైలాగ్ అయినా సరే క్షణాలలో చదివి.. నిమిషాల్లో గుర్తు పెట్టుకొని ..ఒక్క టేక్ లోనే షార్ట్ పూర్తి చేసేది . ముఖ్యంగా ఇతర నటుల లాగా ఆమె రిహార్సల్స్ ఎప్పుడు చేసేది కాదు. ప్రముఖ కోలీవుడ్ నటుడు జెమినీ గణేష్ (Gemini Ganeshan)ను వివాహం చేసుకున్న తర్వాత అతను ఆర్థిక లావాదేవీలు పెద్దగా తెలియని అమాయకురాలైన సావిత్రిని మోసం చేస్తూ ఆమె డబ్బులు అన్ని సర్వనాశనం చేశాడు. ఆ సమయంలో ఆమె మూగ మనుషులు సినిమాను తమిళంలో నిర్మించింది. అయితే తమిళ ప్రేక్షకులుఆ సినిమాను ఆదరించకపోయేసరికి ఆ సినిమాపై పెట్టుబడిగా పెట్టిన డబ్బులు అన్ని పోయాయి.

అప్పటివరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవితం కొనసాగించిన సావిత్రి.. పూర్తిగా ఆస్తిని సైతం కోల్పోయింది. సావిత్రి ఇష్టారాజ్యంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలు నిర్మిస్తోందన్న కోపంతోనే జెమినీ గణేషన్ ఆమెతో మాట్లాడకుండా ఉండేవాడు. ఒకవైపు ఆచంట మరొకవైపు భర్త మాట్లాడకపోవడం ఆమెపై విపరీతంగా ప్రభావం చూపాయి. ఇక ఆ బాధలను మరిచిపోవడానికి ఆల్కహాల్ కి బాగా బానిసయింది. ఒకవైపు మత్తులో ఉండగానే మరొకవైపు ఆర్థిక లావాదేవీలు పెద్దగా తెలియకపోవడంతో ప్రతి ఒక్కరు ఆమె నుండి డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టారు.

అలా ఆమె డబ్బులన్నీ కోల్పోయి.. పన్ను కట్టలేదని ఇన్కమ్ టాక్స్ వారు కూడా ఆమె ఇంటికి వచ్చి ఆస్తులను జప్తు చేయడంతో రోడ్డున పడ్డది. దాంతో తిండి , బట్ట లేక ముఖానికి రంగు పూసుకుని చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయవలసి వచ్చింది . అప్పటికే ఆమెకు షుగర్, బీపీ వంటి వ్యాధులు రావడంతో క్రమంగా శారీరకంగా క్షీణించి ఆ తర్వాత మరణించింది. అలా గోరింటాకు , దేవదాసు మళ్లీ పుట్టాడు వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది సావిత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *