ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేది నటి సూర్యకాంతం(SURYAKANTHAM). సూర్యకాంతం అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ అప్పట్లో ఈమె చాలా ఫేమస్. ఇక ఈమె క్రేజ్ ఎలా ఉండేదంటే ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఒక స్టార్ హీరోయిన్ కి ఉండే క్రేజ్ ఉండేది. సూర్యకాంతం గారు ఎక్కువగా కుటుంబ కథా నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో గయ్యాళి అత్త పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇక అప్పట్లో అత్త పాత్ర చేయాలంటే కచ్చితంగా సూర్యకాంతం పేరు చెప్పేవారు చాలామంది.

ఇక ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఆ పాత్రలో ఎంతలా జీవించేదో.ఇక సూర్యకాంతం గారు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో నటించినప్పటికీ ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. అందరితో చాలా ప్రేమగా కలిసిపోయేదట. సూర్యకాంతం అందరిని ఎంత ఆప్యాయంగా పలకరించినప్పటికీ చాలామంది ఆమెను గయ్యాళి పాత్రలోనే ఊహించుకునేవారు. సినిమాల్లో లాగే బయట కూడా ఆమె గయ్యాలి అని అనుకునేవారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..సూర్యకాంతం భర్తకి బయట భోజనం తినే అలవాటు లేదట. దాంతో సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసి వెళ్లేదట సూర్యకాంతం.

ఇక ఈ విషయంలో చాలా విసిగిపోయిన సూర్యకాంతం తన భర్తను ఎలాగైనా ఒప్పించి ఇంట్లో వంట చేయడానికి ఒక పని మనిషిని పెడదామని చెప్పింది. అయితే తన భర్త ఒప్పుకోవడంతో సూర్యకాంతం రేలంగి వెంకట్రామయ్య (RELANGI VENKATRAMAYYA)అలాగే ఎన్టీఆర్ చెప్పిన విధంగా విజయవాడకు చెందినటువంటి ఒక బ్రాహ్మణ అమ్మాయిని తన ఇంట్లో పనిమనిషిగా తీసుకొచ్చుకోవాలి అనుకుందట. అయితే ఈ విషయం ముందే తెలియని ఆ పనిమనిషి ఏమి అడగకుండా విజయవాడలో రైలు ఎక్కి మద్రాస్ లో దిగిందట. ఇక అక్కడ దిగాక పనిమనిషిని ఇంటికి తీసుకు వెళ్లడానికి కారు పంపించింది సూర్యకాంతం.

ఇక కారు ఎక్కేటప్పుడు ఆ పనిమనిషి ఇంతకీ నేను పని చేసేది ఎవరి ఇంట్లో అనే ప్రశ్న అడిగిందట. దీంతో ఆ ఆ కారు డ్రైవర్ మీరు సూర్యకాంతం ఇంట్లో పని చేయాలి అని చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోయిందట. ఇక ఈ విషయం తెల్సిన సూర్యకాంతం ఎన్టీఆర్ ని చాలా ఆటపట్టించే వారట. ఈ గయ్యాళి అత్తకు ఇంత క్రేజ్ ఉందా అంటూ నవ్వుకునేవారట. కానీ సూర్యకాంతం పడే బాధ చూడలేని ఎన్టీఆర్(NTR) స్వయంగా ఆమె ఇంట్లో ఓ పని మనిషిని తీసుకొచ్చి పెట్టారని గుమ్మడి తాను రాసుకున్న బుక్ లో చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *