టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ(krishna) ఇటీవల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఆయన.. నవంబర్ 15న తుది శ్వాస విడిచారు. పెద్ద దిక్కున కోల్పోవడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర శ్లోకంలో మునిగింది. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ మరణం తీరని లోటుగా మారింది. కృష్ణ అంత్య‌క్రియ‌లు న‌వంబ‌ర్ 16న మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

ఆ త‌ర్వాత ఆయ‌న అస్థికల్ని మహేష్‌ బాబు(mahesh babu) కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.ఇక నిన్న హైదరాబాద్లో కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇంటి వద్ద ఉద‌యం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. పెద్ద కర్మకు విచ్చేసే అతిథుల కోసం హైద‌రాబాద్ లో రెండు వేదికలను మహేష్ బాబు ఏర్పాటు చేశారు.

సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్‌లో విందు ఏర్పాటు చేయ‌గా.. అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్‌లో విందు ఇచ్చారు. దాదాపు 32 వంట‌కాల‌తో అంద‌రినీ భోజ‌నాలు ఏర్పాటు చేశారు. ఐదు వేల మందికి పైగా అభిమానులు కృష్ణ పెద్ద క‌ర్మ‌(krishna pedda karma) కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్ర‌ముఖులు సైతం భారీగా హాజ‌రు అయిన‌ట్లు తెలుస్తోంది.

అయితే కృష్ణ పెద్ద క‌ర్మ‌కు పెట్టిన ఖ‌ర్చు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మ‌హేష్ బాబు త‌న తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద క‌ర్మ‌లో ఎటువంటి లోటు జ‌ర‌గ‌కుండా ప‌క్కా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అలాగే ఈ కార్య‌క్ర‌మం కోసం మ‌హేష్ బాబు రూ. 2 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఇక ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ మాట్లాడుతూ.. నాన్న భౌతికంగా దూర‌మైనా త‌న‌ గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోతార‌ని, మ‌న అంద‌రి మ‌ధ్య ఉంటార‌ని చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అలాగే నాన్న‌ కృష్ణ త‌న‌కు చాలా ఇచ్చాడ‌ని, వాటిలో అన్నింటికంటే గొప్ప‌ది మీ అభిమాన‌మే అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కూడా మ‌హేష్ మాట్లాడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *