శ్రీకాంత్ కొడుకు హీరోగా వచ్చిన పెళ్లి సందD(PELLI SANDADI)సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ శ్రీ లీల. ఇక ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే అందరినీ అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఓకే సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది శ్రీలీలా . రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.

అయితే ప్రస్తుతం శ్రీ లీల చేతిలో దాదాపు 7,8 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే శ్రీ లీల ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తానని ఒప్పుకొని తన కెరీర్ ని ఇరకాటంలో పడేసుకుంటుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.ఇక విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ మహేష్ బాబు(MAHESH BABU) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఇప్పటికే పూజ హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ని తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట.

ఇక ఈ విషయంలో శ్రీలీల కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం తెల్సిన శ్రీ లీల అభిమానులు మీరు ఆ సినిమాలో చేయొద్దు ప్లీజ్ అంటూ బతిమిలాడుతున్నారట. ఎందుకంటే.. సెకండ్ హీరోయిన్ గా చేస్తే అన్ని అలాంటి ఛాన్స్ లే వస్తాయని శ్రీలీలా అభిమానుల అభిప్రాయం. అంతేకాదు త్రివిక్రమ్(TRIVIKRAM) సినిమాలో ఎవరైనా సరే సెకండ్ హీరోయిన్ గా చేస్తే మళ్ళీ వారికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు అని ఒక సెంటిమెంట్ కూడా ఉంది.

దానికి కారణం ఇప్పటికే చాలామంది హీరోయిన్ల విషయంలో ఈ సీన్ రిపీట్ అయింది.కాబట్టి శ్రీ లీల(SRILEELA) విషయంలో ఆమె అభిమానులు భయపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాకి నో చెప్పడమే కరెక్ట్ అంటూ ఆమెకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు.ఇక అభిమానుల చెప్పే మాటలను శ్రీ లీల పాటిస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *