సమాజంలో వ్యక్తులు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అంటే ఎంత నీచానికైనా దిగజారడానికి వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యంగా ఏదైనా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి దుండగుల నుంచి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఇలాంటి బెదిరింపులే తన కూతురికి వచ్చాయని ఒక స్టార్ డైరెక్టర్ సంచలన విషయాలను తాజాగా బయట పెట్టడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ప్రస్తుతం ఉన్న చట్టానికి వ్యతిరేకంగా నా కూతురు ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి అని ఆ డైరెక్టర్ తెలిపాడు.. భారతదేశంలో 2014 ముందు వరకు అక్రమంగా బౌద్ధులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, పార్శీలు ఇలా మొదలైన విదేశీయులు చోరబడ్డారు అలాంటి వారిని ఏరివేయడానికి ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమంలో నా కూతురు కూడా పాల్గొనింది. అప్పుడు నా కూతుర్ని రేప్ చేసి.. చంపేస్తామని బెదిరించారు అంటూ బాలీవుడ్ బడా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) చెప్పుకుంటూ కన్నీరు అయ్యారు.

Anurag Kashyap's daughter Aaliyah says her parents 'know about her  'experiments' as a teenager'

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది.. నా కూతురు ఆలియా (Alia) కి వచ్చిన బెదిరింపులు విని ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది .అది తట్టుకోలేక నాకు గుండెపోటు కూడా వచ్చింది అని ఆ స్టార్ డైరెక్టర్ వెల్లడించారు . అదే సమయంలో నేను నా ట్విట్టర్ ఖాతాని కూడా తొలగించి 2019లో పోర్చుగల్ వెళ్ళామని అనురాగ్ తెలిపాడు.. అయితే నా కూతుర్ని చూసి నేను గర్వపడుతున్నాను ఆమె ధైర్యానికి ,తెగువకు ఆశ్చర్యపోయాను.

అన్ని బెదిరింపులు వచ్చినా.. తన కెరియర్ పై మరింతగా దృష్టి పెట్టిందని అనురాగ్ కశ్యప్ తన కూతురు గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇతరుల లాగా కూర్చొని లగ్జరీ లైఫ్ ను అనుభవించే అదృష్టం తనకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అనురాగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *