ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్లు ఇలా ప్రతి ఒక్కరు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ లో యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ అయిన అలియా భట్(ALIYA BHATT) రన్బీర్ కపూర్ లు కూడా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లల్ని కూడా కన్నారు. ఇక తాజాగా హన్సిక కూడా డిసెంబర్ 4న గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతోంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కూడా పెళ్లికి సిద్ధమైందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఈ హీరోయిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే తాజాగా ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. కియారా అద్వానీ బాలీవుడ్ స్టార్ హీరో అయిన సిద్ధార్త్ మల్హోత్రా(SIDDARTH MALHOTRA) ఇద్దరూ చాలా రోజుల నుండి డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

అలాగే ఆ వార్తలకు తగ్గట్టుగానే వీళ్ళు కూడా చెట్టాపట్టాలేసుకొని చాలాసార్లు మీడియా కంటపడ్డారు. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా వీరు పెళ్లి పై అధికారికంగా త్వరలోనే చెప్పబోతున్నారు అంటూ సమాచారం. ఇక ఈ విషయం చెప్పే కన్నా ముందే కియారా అద్వానీ (KIARA ADVANI)తన పెళ్లి గురించి ఒక చిన్న క్లూ ఇచ్చింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అదేంటంటే.. “ఇంకా సీక్రెట్ ని దాచలేను డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు అందరూ కియారా త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతుంది కావచ్చు అంటూ సంతోష పడుతున్నారు.

ఇక మరోవైపు వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ ప్రేమ విషయం ఇరుకుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని అంగరంగ వైభవంగా వీళ్ళిద్దరూ డిసెంబర్ 5న ఒక్కటి కాబోతున్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో నిజమెంతుందో తెలియాలంటే కచ్చితంగా డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం కియారా అద్వానీ రాంచరణ్ (RAM CHARAN)హీరోగా వస్తున్న RC15 అనే సినిమాలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *