సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జపాన్లో కూడా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు అంటే ఆయన నటనకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ కు ఎంత గుర్తింపు ఉందో టాలీవుడ్ లో కూడా నటభూషణ్ శోభన్ బాబుకు అంతే ప్రత్యేకత ఉంది. ఆయనను అభిమానించేవారు ఇప్పటికీ కూడా ఆయన జయంతి, వర్ధంతిలను చేస్తూ వస్తున్నారు. ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు గ్లామర్ హీరోగా పాపులర్ అయినా సరే.. డి గ్లామర్ రోల్స్ లో కూడా మెప్పించారు.

ఈ సోగ్గాడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. ఈయన తెరకెక్కించిన చాలా సినిమాలు ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. అయితే శోభన్ బాబు (Shobhanbabu)నటించిన సినిమాలన్నీ ఒకవైపు అయితే.. శోభన్ బాబు నటించిన మానవుడు దానవుడు సినిమా మరొకవైపు.. ఈ సినిమా కంటే ముందు శోభన్ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఉండేది. కానీ ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఈ సినిమాను హీరో రజనీకాంత్ ఏకంగా 14 సార్లు అది కూడా థియేటర్లో చూశారట. అయితే అప్పుడు రజినీకాంత్ మాత్రం హీరో కాదు.. బెంగళూరులో బస్సు కండక్టర్గా పనిచేస్తున్న సమయంలో తాను ఈ సినిమా చూశానని రజినీకాంత్ చెబుతూ ఉంటారు.

మనసున్న మంచి పాట - మానవుడు దానవుడు - అణువు అణువున వెలసిన దేవా, అమ్మ లాంటి చల్లనిది - Songs - లోకం తీరు/ News

అయితే రజనీకాంత్ ఈ సినిమా చూడడం పెద్ద వింతేమీ కాదు.. కానీ ఆయన ఈ సినిమాను ఏకంగా 14 సార్లు అది కూడా థియేటర్లో చూడడం విశేషం. అలాగే శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణం సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న రోజునే మానవుడు దానవుడు సినిమా కూడా విడుదలవడం విశేషం. అలా విడుదలైన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కలెక్షన్ల సునామీ కురిపించి శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టింది.Jeevana Poratam | Watch Full Movie Online | Eros Now

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో అక్క చిన్న వయసులో లైంగిక దాడికి గురవుతూ ఉంటుంది. హీరో పెరిగి పెద్దవాడయ్యాక ఉదయం మంచివాడిగా డాక్టర్ గా కనిపిస్తూ.. రాత్రులు మానవ మృగాలను వేటాడుతూ ఉంటాడు.. సినిమా చూస్తున్నంతసేపు డబుల్ యాక్షన్ అనిపిస్తుంది. కానీ సినిమా పూర్తయిన తర్వాత ఇద్దరు ఒక్కరే అన్న ట్విస్ట్ ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురిచేస్తుంది. అలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *