నిధి అగ‌ర్వాల్(nidhi agarwal).. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన `స‌వ్య‌సాచి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే నాగ‌చైత‌న్య సోద‌రుడు అఖిల్ కు జోడీగా `మిస్టర్ మజ్ను` మూవీలో న‌టించింది. అయితే అక్కినేని అన్న‌ద‌మ్ములిద్ద‌రూ నిధి పాప‌కు హిట్ మాత్రం అందించ‌లేక‌పోయారు.

కానీ, ఈ సినిమాల ద్వారా నిధి ఆక‌ట్టుకునే అందం, అల‌రించే న‌ట‌న‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే `ఇస్మార్ట్ శంక‌ర్‌(ismart shankar)` మూవీతోనే అవ‌కాశాన్ని అందుకుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నిధి తొలి హిట్ ను ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్ తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాలు చేస్తోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. నిధి అగ‌ర్వాల్ ప్రేమ‌, డేటింగ్ వంటి విష‌యాల్లో చాలా స్పీడ్‌గా ఉంది. అస‌లు ఈ అమ్మ‌డు ఏ వ‌య‌సులో తొలిసారి ప్రేమ‌లో ప‌డిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అవును, 4వ త‌ర‌గతి చ‌దువుకుంటున్న స‌మ‌యంలోనే నిధి ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అప్ప‌టికి ఆమె వ‌య‌సు ప‌దేళ్ల‌కు లోపే ఉంటుంది. ఈ విష‌యాన్ని గ‌తంలో నిధి స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఇక కొంచెం పెద్దయ్యాక నిధి అగ‌ర్వాల్ ఒక అబ్బాయితో డేటింగ్‌కి వెళ్లింద‌ట‌. ఆ వ్యక్తి నుంచే నిధి ఫ‌స్ట్ లవ్ ప్రపోజల్ అందుకుంద‌ట‌. అలాగే లైఫ్‌లో నిధికి ఒకే ఒక్క‌సారి తీవ్ర స్థాయిలో హార్ట్ బ్రేక్ అయిందట. మ‌రి త‌న హార్ట్ బ్రేక్ చేసింది ఎవ‌రు అన్న‌ది మాత్రం నిధి చెప్ప‌లేదు. ఇక‌పోతే ప్ర‌స్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ శింబు(simbu)తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అటు శింబుగానీ, ఇటు నిధిగానీ ఈ వార్త‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌న్నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *