టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మధుడు నాగార్జున(nagarjuna) సరైన హిట్ కోసం ఎప్పటినుంచో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల ఈయన `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తే.. ప్రవీణ్ సత్తారు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దాసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

`ది ఘోస్ట్‌`పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నాగార్జున‌కు ఫైన‌ల్‌గా నిరాశే ఎదురైంది. ప్ర‌స్తుతం నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్ ల‌ పై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే.. గత ప‌దేళ్ల నుంచి నాగార్జున పేరిట ఒక అరుదైన రికార్డు లెక్కించి ఉంది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ ఒక్క హీరో కూడా బ్రేక్ చేయలేకపోవడం గ‌మ‌న్నార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున, అనుష్క శెట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో `డమరుకం(damarukam)` ఒకటి.

శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.వెంకట్ దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్(devi sri prasad) సంగీతాన్ని అందించారు. ఆ టైంకి నాగార్జున కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. ఇక‌ రిలీజ్ కు చాలా కష్టాలు పడిన ఈ సినిమా.. ఎట్ట‌కేల‌కు 2012 నవంబర్ 23న విడుద‌లై ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. నవంబర్ వంటి అన్ సీజన్ లో రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ఈ స్థాయి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచిందీ చిత్రం. అంతేకాదు, నవంబర్ వంటి అన్ సీజన్ లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన స్ట్రైట్ తెలుగు సినిమాగా రికార్డును సృష్టించింది. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను ఏ ఒక్క హీరో కూడా బ్రేక్ చేయ‌లేక‌పోయ‌డు. ఈ ఏడాది కూడా న‌వంబ‌ర్ నెల‌లో ఏ తెలుగు సినిమా కూడా డ‌మ‌రుకం స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *