నందమూరి నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ (Sr.ntr)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన హీరో అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలిసిందే. ఇక ఆయన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారి ఒకానొక టైం లో ఈయన లేకపోతే ఇండస్ట్రీ లేదు అనే పరిస్థితికి తీసుకువచ్చారు. అంతలా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే సినిమాల్లోనే కాకుండా ఓ పక్క రాజకీయాల్లో కూడా పాల్గొని అక్కడ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం(Telugudesham) పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ విషయం పక్కన పెడితే ఈయన దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి అందర్నీ అలరించారు. కేవలం హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఇక అప్పటి వారికి రాముడు, కృష్ణుడు అనగానే ముందుగా అన్నగారే గుర్తుకు వచ్చేవారంటే ఆయన పాత్రలో ఎంత ఒదిగిపోయి నటించారో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈయన అధికారంలో ఉండి ముఖ్యమంత్రి అయినప్పుడు పేద ప్రజలకు తినడానికి ఎలాంటి కొరత ఉండకుండా చూడడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం అని ఇచ్చి పేద ప్రజలను కష్ట సమయాల్లో ఆదుకున్నాడు. ఇక ఎన్టీఆర్ గారికి దేవుడు అంటే అపారమైన భక్తి. ఇక దేవుడి మీద ఉన్న భక్తితో తన కొడుకులు, కూతుర్లకు కూడా దేవుళ్ళ పేర్లు కలిసి వచ్చేలా తానే సెలెక్ట్ చేసి పేర్లు పెట్టారు. అలాగే ఈయనకు తెలుగు భాష అంటే కూడా చాలా ఇష్టం.

అందుకే తన కొడుకులు అందరికీ జయ కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ(balakrishna), సాయి కృష్ణ, మోహన కృష్ణ ,జయశంకర్ కృష్ణ వంటివి పెట్టి చివరలో అందరి పేరులో కృష్ణ అనే వచ్చేలా పెట్టారు. అలాగే కూతుర్ల పేర్లు చూస్తే పురందరేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఇలా వీరి పేర్ల చివర ఈశ్వరి అనే పేరు వచ్చేలా పెట్టారు. అయితే అన్నగారు కేవలం కొడుకులు,కూతుర్ల విషయంలోనే కాదు మనవలు మనవరాళ్ల పేర్ల విషయంలో కూడా మంచి పేర్లను సెలెక్ట్ చేసి పెట్టారు. ఈ పేర్లను కనుక పరిశీలిస్తే ఎన్టీఆర్ కి తెలుగు భాష పై అలాగే దేవుడిపై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *