నట సింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) `అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంతరం గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. `వీర సింహారెడ్డి` టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ మూవీని ప్రారంభించబోతున్నాడు.

`ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్(shine screens banner) పై సాహో గారపాటి నిర్మించబోతున్నారు తండ్రి కూతురు మధ్య ఈ సినిమా కథ న‌డుస్తుంది. ఇందులో బాలయ్య కూతురుగా ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారు. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాల‌లో ఎవ‌రో ఒకరిని హీరోయిన్‌గా ఫైన‌ల్ చెయ‌నున్నార‌ని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సినిమాలో ఓ కీల‌క‌ పాత్ర ఉంటుందట. సినిమాకు హైలెట్ అయ్యే పాత్ర‌ల్లో అదీ ఒక‌టి అట‌. అయితే ఆ పాత్ర కోసం అనిల్ రావిపూడి ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో బాలయ్య స్వయంగా ప్రముఖ నటి స్నేహ పేరును సూచించాడట. స్నేహ(sneha) అయితే ఆ పాత్రకు చక్కగా సూట్ అవుతుందని బాలయ్య చెప్పాడట. ఇక బాలయ్య చెప్పాక మరో మాట మాట్లాడకుండా అనిల్ రావిపూడి వెంటనే స్నేహాను సంప్రదించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

కాగా, బాలయ్య-స్నేహ జంటగా మహారథి, పాండురంగడు(Pandurangadu) చిత్రాల్లో నటించారు. ఈ సినిమా సమయంలోనే స్నేహ, బాలయ్యకు మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అలాగే స్నేహ వినయ విధేయతలు బాలయ్యకు ఎంతో ఇష్టమట. ఆమె ఇతరులతో మాట్లాడే తీరు, ఆమె పోషించే పాత్రలు బాలయ్యకు ఎంతో నచ్చుతాయట. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి పాత్ర గురించి డిస్కస్ చేయగానే బాలయ్యకు స్నేహ పేరు గుర్తుకు వచ్చిందని, ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని చెప్పార‌ట‌. మొత్తానికి పెళ్లయిన హీరోయిన్‌కు బాలయ్య అడిగి మరీ అవ‌కాశాన్ని ఇచ్చారంటూ టాక్‌ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

https://youtu.be/KbYYOkMdS18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *