ప్రభాస్ హీరో గా నటించిన ఆది పురుష్ (Adi Purush) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేని ప్రభాస్ ఈ సినిమా ను సంక్రాంతి కి విడుదల అవడాన్ని ఆపేశాడు. లేదంటే ఈ పాటికే ఈ సినిమా హడావుడి మొదలయ్యేది.

ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి సనన్ (Krithi sanan) నటిస్తుండగా విలన్ పాత్ర లో సైఫ్ అలీఖాన్ (Saif Ali khan) నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల పట్ల ఎన్నో రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా పూర్తిగా పక్కన పెట్టేశారని, ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా దీని గురించి వివరాలు వెల్లడించారు మేకర్స్.

3డీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో (3d Motion capture Technology) రాబోతున్న ఈ సినిమా ను దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు.

ఈ సినిమా ను జూన్ లో విడుదల చేయబోతున్నామని చెబుతున్నారు. ఈ లోపు ఈ సినిమా ను విజువల్ వండర్ గా రూపొందించి ప్రేక్షకులను అలరిస్తామని చెప్పారు. ఏదేమైనా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ త్వరలోనే రావడం అయన అభిమానులను ఎంతో ఆసక్తి పరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *