సాధారణంగా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే కాదు వివిధ విభాగాలలో కూడా ఉంటుందనడానికి ఈ విషయాన్ని బయటపెట్టిన బాధితులే నిదర్శనం అని చెప్పవచ్చు. నిజానికి కొన్ని కొన్ని సార్లు జనాలు విచక్షతను కోల్పోతూ ఉంటారు.. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు కూడా అసభ్యంగా ప్రవర్తించడం చాలా సందర్భాలలో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అమానుషంగా ప్రవర్తించే వారిని సమాజం నుంచి వెలివేయాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది.మరీ ముఖ్యంగా సినిమా వారికైతే లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వేధింపులు మరీ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ వేధింపులకు పాల్పడేది ఏ ఆకతాయో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ సొసైటీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వారు కూడా ఇలా ఆడవాళ్ళపై వేధింపులకు పాల్పడితే ఇంకేమని చెప్పుకుంటారు.. ఇప్పటికే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇచ్చే స్వేచ్ఛను అదునుగా తీసుకొని కొంతమంది నెటిజన్లు విపరీతమైన కామెంట్స్ తో వారిని మరింతగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు

ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ టీవీ నటి.. సూపర్ సింగర్ ఫేమ్ సౌందర్య బాల నందకుమార్ కి సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎదురయ్యాయట.. తన కోరిక తీరిస్తే ఎంత డబ్బు అడిగినా సరే ఇస్తానని.. ఒక ప్రొఫెసర్ ఆమెను ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రతిరోజు మెసేజ్ చేస్తూ సతాయించేవాడట. “నువ్వంటే చాలా ఇష్టం.. నా కోరిక తీరిస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను” అంటూ ఒక వ్యక్తి ఆమెకు మెసేజ్లు పంపించేవాడట. అయితే వీటిని ఆమె స్క్రీన్ షాట్ తీసి మరీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ అసలు విషయాన్నీ బయటపెట్టింది. అయితే ఇలాంటి మెసేజ్లు చేసింది ఒక ఆకతాయి అయితే పర్వాలేదు కానీ ఒక ప్రొఫెసర్ అని తెలిసి అమ్మాయిలకు మరింత జాగ్రత్తగా ఉండమని సూచించింది సౌందర్య.

అయితే ఎలాగైనా సరే ఆ ప్రొఫెసర్ ను పట్టుకొని తగిన దండన విధిస్తాము అని కూడా ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పలువురు నెటిజన్ లు ఆ ప్రొఫెసర్ పై దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి దారుణాలకు ఎలా పాల్పడతారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *