రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈరోజే ఈ సినిమా కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి బుచ్చిబాబు మొదట్లో గట్టి ప్రయత్నాలు చేశాడు కానీ ఫైనల్ గా అయన రామ్ చరణ్ తో సినిమా చేస్తుండడం విశేషం.

స్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. కొన్ని రోజుల సస్పెన్స్ తర్వాత ఈ సినిమా ను ప్రకటించడం విశేషం. అయితే ఈ సినిమా ఒకే కావడానికి ముఖ్య కారణం సుకుమార్ అని తెలుస్తుంది. సుకుమార్ దగ్గర బుచ్చిబాబు దర్శకత్వ శాఖ లో పని చేయగా ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ నేపథ్యంలో అయన రెండో సినిమా నే స్టార్ హీరో తో చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్ త్వరలోనే ఈ సినిమా ను మొదలుపెట్టబోతున్నాడు. మరి ఎంతో నమ్మి అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెడతాడా అనేది చూడాలి. ఈ సినిమా కి పెద్ది అనే టైటిల్ ను నిర్ణయించబోతున్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *