తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha).. ఆంధ్ర సోగ్గాడు శోభన్ బాబు ప్రేమాయణం గురించి యావత్ దేశానికి తెలిసినదే. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా డాక్టర్ బాబు.. ఈ సినిమా గురించి మాట్లాడేందుకు వెళ్లే సమయంలోనే వీరిద్దరిని తానే పరిచయం చేసినట్లు తెలిపారుటాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు తమ్మారెడ్డి భరద్వాజ.Sobhan Babu was starstruck by Jayalalithaa

ఆయన మాట్లాడుతూ..” శోభన్ బాబును (Shobhanbabu) కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి కారులో ఎక్కించుకొని ఊటీకి తీసుకువెళ్లి జయలలితకు పరిచయం చేయించినట్లు తెలిపారు. అయితే జయలలితను చూడడం అదే తొలిసారి కావడంతో ఆమె ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారో ?అని శోభన్ బాబు భయపడేవారు అంటూ భరద్వాజ తెలిపారు. కాసేపట్లోనే ఇద్దరి మధ్య మాటలు కలిసినట్లు .. ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకోగానే.. తాను అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు కూడా భరద్వాజ వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పిన భరద్వాజ ప్రతి వారికి కొన్ని కొన్ని అభిరుచులు ఉంటాయని కూడా స్పష్టం చేశాడు.Jayalalithaa's Story: From Alleged Marriage With Sobhan To Affair With MGR, Things 'Thalaivi' Missed

ఆ ఇష్టాల కారణంగానే కొంతమంది తొందరగానే దగ్గర అవుతారని .. అలా శోభన్ బాబు, జయలలిత అభిప్రాయాలు కలవడంతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే వారిని కూడా తెలిపారు. ఇద్దరూ కలిసి ఉన్న మాట వాస్తవమే కానీ ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా భరద్వాజ తమ్మారెడ్డి (Bharadwaja Tammareddy) వెల్లడించారు. అయితే గత కొద్ది రోజులుగా శోభన్ బాబు, జయలలితకు పిల్లలు జన్మించారని .. వారిని బయటకు కనపడకుండా ఉంచారు అనే మాటలను ఆయన కొట్టిపడేశారు.జయలలిత బయోపిక్‌లో శోభన్ బాబు ఎవరు.. వాళ్ల బంధం..? | Suspense continues over Sobhan Babu role in Jayalalitha Biopic Thalaivi pk– News18 Telugu

ఒకవేళ జయలలిత, శోభన్ బాబుకు పిల్లలు గనుక ఉండి ఉంటే శశికళ (Sasikala) లాంటి పిచ్చి వాళ్ళను తీసుకొచ్చి అంత మంచి పొజిషన్ కి తీసుకెళ్లడం కంటే సొంత పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చే వారు కదా అంటూ ప్రశ్నించారు. కొన్ని రోజులుగా జయలలిత , శోభన్ బాబులకు పిల్లలు ఉన్నారంటూ వార్తలు రావడం .. మేమే జయలలిత బిడ్డలం అంటూ కొంతమంది మీడియా ముందు హడావిడి చేయడం నవ్వు తెప్పించే విషయాలు అంటూ భరద్వాజ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *