సోషల్ మీడియాను ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా మంచి పాపులారిటీ సంపాదించడమే కాకుండా భారీగా ఆదాయాన్ని కూడా సంపాదిస్తూ ఉన్నారు. కొంతమంది అందులో ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సైతం సినిమాలకంటే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో క్రేజ్ సంపాదించిన ఎంతోమంది హీరోయిన్స్ లక్షలలో ఫాలోవర్స్ ని సంపాదించుకొని రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది హీరోయిన్స్ పార్ట్ టైం ఉద్యోగంలా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదాయం ఇక్కడ బాగా వస్తుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్క పోస్ట్ చేస్తే లక్షలలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలా హీరోయిన్స్ ఎంత సంపాదిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం.

1). కాజల్ అగర్వాల్:
చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో 24.1 మిరియన్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేస్తే దాదాపుగా రూ.32 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2). రకుల్ ప్రీతిసింగ్:
కెరటం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒక్క పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిందంటే రూ.35 లక్షల రూపాయలు అందుకుంటోందట. ఈమె ఇన్ స్టా ఫాలోవర్స్ 22.8 మిలియన్స్.

3). పూజా హెగ్డే:
ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో 21.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఒక్కో పోస్టుకి రూ.20 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం.

4). సమంత:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇన్స్టా లో 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కో పోస్ట్ కి సమంత రూ. 20 లక్షల రూపాయలకు పైగా అందుకుంటున్నట్లు సమాచారం.

5). జెనీలియా:
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన జెనీలియా ఒక్కో పోస్ట్ కి రూ.40 లక్షల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.

6). రష్మిక:
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మకి ఇన్ స్టాగ్రామ్ లో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కో పోస్ట్ కి అక్షరాల రూ.40 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం.

ఇక వేరే కాకుండా మరి కొంతమంది యాంకర్స్, హీరోయిన్స్ కొన్ని లక్షల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *