రష్మిక మందన్న.. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప(PUSHPA) తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయి నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో కూడా రష్మిక టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు అక్కడ కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఈమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాకపోయినప్పటికీ కూడా అక్కడ స్టార్డం తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా రష్మిక ఓ వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే రష్మికని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం రష్మిక చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే. ఈ మధ్యనే కన్నడ ఇండస్ట్రీలో తెరికెక్కిన కాంతారా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇక ఈ సినిమా విషయంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక ని మీరు కాంతారా(KANTHARA) సినిమా చూశారా? అది ఎలా ఉంది?అని అడగగా అసలు నేను ఆ సినిమా ఇప్పుడు వరకు చూడలేదు అంటూ చెప్పడంతో ఈమెపై అప్పటినుండి ట్రోలింగ్ మొదలైంది..

కన్నడ అమ్మాయివి అయ్యుండి కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా కాంతారా సినిమా తెలియదా?ఈ విషయంలో నువ్వు కన్నడ ఇండస్ట్రీని అవమానించినట్టే..అంటూ చాలామంది ఈమెను విమర్శించారు. అయితే కాంతారా సినిమా గురించి రష్మిక మాట్లాడకపోవడానికి కారణం రష్మికకు రిషబ్ శెట్టి(RISHAB SHETTI) కి అంతకుముందే ఉన్న గొడవలు. అవును..వీరిద్దరికి అంతకుముందే ఏవో గొడవలు ఉన్నాయట. ఇక ఆ గొడవల వల్లే రష్మిక కాంతారా సినిమా చూడలేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అంతకుముందు కూడా రష్మిక అన్ని భాషల లాగే నాకు కన్నడ మాట్లాడడం కూడా చాలా కష్టం అని చెప్పింది.

ఇక ఈ విషయంలో మాతృభాష కూడా నీకు సరిగ్గా రాదా అంటూ ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని చూస్తుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఈ మధ్య తన జాతకం ఏమీ బాగాలేదని సీక్రెట్ గా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(VENUSWAMY)ని కలిసింది అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అంతేకాదు ఇప్పుడు ఈ సమస్యలన్నింటిని తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పండి అంటూ ఆ స్వామీజీని అడగడంతో ఆయన కొన్ని శాంతి పరిహార పూజలు చేయించారట. ఇక ఈ పూజల వల్ల ఈమె చిక్కుకున్న అన్ని వివాదాలు నుండి బయటపడి మునపటిలా మళ్లీ అవకాశాలు రావాలని ఈ పూజలు చేస్తోందట. ఇక ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే రష్మిక క్లారిటీ ఇవ్వాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *