నరేష్ పవిత్ర లోకేష్ జంటకు ఏమైంది? ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉంటున్నారు. అసలు వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సొంత భార్య భర్తల్లా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా కృష్ణ మరణంతో వీరిద్దరూ కలిసి ఆయన ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. దీంతో చాలా మంది నేటీజెన్స్ వివిధ రకాలుగా ట్రోలింగ్ చేస్తూ, మీరు కృష్ణ(Krishna) గారిని అపవిత్రం చేస్తున్నారని మాట్లాడుతున్నారు.

ఈ విధంగా పవిత్ర లోకేష్ నరేష్ ల వ్యవహారం గత సంవత్సర కాలం నుండి హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత కొన్ని నెలల క్రితం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya raghupathi)మైసూర్ హోటల్లో ఇద్దరిని రెడ్ హండెడ్ గా పట్టుకుంది. ఇక అప్పటినుంచి వీరి విషయం పుంకాను పుంకాలుగా బయటకు వస్తూనే ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి సొంత భార్యాభర్తల్లా అన్ని కార్యక్రమాల్లో కనిపించడం కృష్ణ కుటుంబీకులకు, ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయట.

ఈ తరంలోనే పలు వెబ్సైట్లలో కూడా వివిధ రకాల కథనాలు వచ్చాయి. దీంతో పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ (cyber crime)పోలీసులను ఆశ్రయించిందని తెలుస్తోంది. ఇక ఈమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్,వెబ్సైట్స్ నాపై ఉదేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొందట. మరీ ముఖ్యంగా కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న టైం లో వీరిద్దరూ కలిసి అన్ని పనులు చేయడం చర్చకు దారి తీసింది. దీనికి ప్రధాన కారణం అధికారికంగా వీరు వివాహం చేసుకోలేదు.

నరేష్ (Naresh)మూడో భార్య ఎక్కడో మూలన నిలబడి ఉంటే వీరిద్దరూ కలిసి పార్థివదేహానికి చేయి చేయి పట్టుకొని పూలు వేయడం అనేకమంది ప్రముఖుల మధ్యలో వీరిద్దరూ జంటగా తిరుగుతూ కనిపించడం నెటిజన్లకు మరింత చిరాకు తెప్పించిందని చెప్పవచ్చు. ఏదేమైనా గత కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉన్న వీరిద్దరూ, ప్రస్తుతం ఫిర్యాదు చేయడానికి వెళ్లడం చాలా ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరెవరి మీద ఫిర్యాదు చేసిందనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *