టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(mahesh babu) గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్న ఈయన.. చివ‌రిగా `స‌ర్కారు వారి పాట` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను ప‌ట్టాలెక్కించారు.

మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28(ssmb28)` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పట్టాలెక్కించారు. అతడు, ఖ‌లేజ‌ సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను సైతం కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ‌ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.

అయితే సెకండ్ హీరోయిన్ గా యంగ్ సెన్షేష‌న్‌ శ్రీలీల‌(sreeleela)ను ఎంపిక చేసారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని.. మహేష్ సినిమా అనగానే శ్రీలీల వెంటనే ఓకే చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శ్రీలీల నటించకపోవచ్చు అని అంటున్నారు. అందుకు కారణం మహేష్ బాబు అని తెలుస్తోంది.

తన సినిమాలో శ్రీ లీల వద్దని, ఆమె ఉంటే తాను చేయనని మహేష్ బాబు త్రివిక్ర‌మ్‌(trivikram)కు వార్నింగ్ ఇచ్చారట. అందుకు కారణం తనకు శ్రీ‌లీల‌కు మధ్య ఏజ్ గ్యాప్ భారీగా ఉండడమేఅట. మహేష్ శ్రీలీల మధ్య దాదాపు 21 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంటుంది. దాదాపు మహేష్ బాబు కూతురు వయసు శ్రీలీలది. ఈ నేప‌థ్యంలోనే మహేష్ ఆమెను హీరోయిన్ గా వద్దని త్రివిక్రమ్ కి చెప్పార‌ట‌. దీంతో చేసేదేమి లేక త్రివిక్ర‌మ్ ను ఆమెను సినిమా నుంచి తొల‌గించారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *