తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ కి ఎలాంటి గౌరవం ఉందో అందరికీ తెలిసిందే.అల్లు రామలింగయ్య (Allu ramalingayya)తన అద్భుతమైన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇక ఈయన వారసులుగా అల్లు బాబి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా,అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ఇక అల్లు శిరీష్ మాత్రం స్టార్ డం తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు.

 

ఇక ఈ మధ్యనే ఈయన నటించిన ఊర్వశివో రాక్షసివో(Urvasivo rakshasivo) సినిమా మంచి హిట్ అయింది. మరి ఈ సినిమా వల్ల అయినా ఈయనకు స్టార్డం వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే చాలా రోజుల నుండి అల్లు ఫ్యామిలీ అల్లు శిరీష్ ని పట్టించుకోవడం లేదని శిరీష్ కి అల్లు ఫ్యామిలి కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అల్లు శిరీష్ ఇప్పటికే మా మధ్యన ఏమీ లేవు అని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈ వార్తలు ఆగడం లేదు. ఎందుకంటే ఇద్దరు కొడుకులు మంచి ప్రయోజకులు అయ్యారు. చిన్న కొడుకును మాత్రం అల్లు అరవింద్ అలా వదిలేసారు ఏంటి? అంటూ ఆయన విమర్శిస్తున్నారు.

 

అయితే అల్లు అరవింద్ శిరీష్ కి కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బాగానే సపోర్ట్ చేశారట. కానీ ఈయన సినీ కెరియర్ బాగా లేకపోవడంతో ఇప్పుడు కాస్త పట్టించుకోవడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ (Allu arjun),అల్లు బాబీ ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో సెటిల్ అయ్యారు. కానీ శిరీష్ మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అలాగే అల్లు శిరీష్ కి ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో బ్రేకప్ లు అయ్యాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు శిరీష్ లైఫ్ ఇలా అవ్వడానికి కారణం ఆయన బిహేవియరే అని తెలుస్తోంది. ఎందుకంటే అల్లు శిరీష్ ఎక్కువగా ఎవరితో కలవడు.

ఒకవేళ అలా కలిసినా కూడా వారితో ఎక్కువ రోజులు ఉండలేడు. ఇలా తన బిహేవియర్ కారణంగా చాలామంది అమ్మాయిలతో ఇప్పటికే బ్రేకప్స్ కూడా జరిగాయి. దీంతో తన తప్పుడు నిర్ణయాలు, బిహేవియర్ కారణంగా ఎదగలేక పోతున్నారు అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో అల్లు అరవింద్(Allu aravindh) తో పాటు అల్లు శిరీష్ పై కూడా ఎక్కువ మొత్తంలో ట్రోల్స్ వస్తున్నాయి. అంతేకాదు అల్లు శిరీష్ బిహేవియర్ మార్చుకోకపోతే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కష్టం అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *