టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈయనకు నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం వాడుకోకుండా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్(RRR) లో నటించి పాన్ ఇండియా స్టార్ గా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ విషయం పక్కన పెడితే..ఎన్టీఆర్ తన భార్యను ఓ ప్రముఖ బిజినెస్ మాన్ కుటుంబం నుంచి తెచ్చుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి(LAKSHMI PRANATHI)ని పెళ్లి చేసుకున్నాక ఆమె ఎన్టీఆర్ కి అన్ని దగ్గరుండి చేసి పెట్టేది. సినిమాల విషయంలో కూడా అన్ని లక్ష్మీ ప్రణతి చూసుకుంటుందట. ఇక ఈమె ఎక్కువగా మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కనిపించదు.. తన పనేంటో తాను చేసుకుంటుంది.ఇక ఈమె ఫ్యామిలీతో కలిసి ఎటైనా టూర్లకు వెళ్ళినప్పుడు ఆ ఫోటోలను ఎన్టీఆర్ తన అభిమానులతో పంచుకున్నప్పుడే కనిపిస్తుంది.

ఇక మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ కోడలుగా నందమూరి ఇంట్లో తన బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే..జూనియర్ ఎన్టీఆర్(JR.NTR) కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతుందో మనకు తెలిసిందే. అయితే ఇంట్లో అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోని పెట్టుకుని లక్ష్మీ ప్రణతికి మాత్రం వేరే హీరో అంటే ఇష్టమట. ఇక ఆ హీరో ఎవరో కాదు.. ఈ మధ్యనే పెళ్లి పీటలు ఎక్కిన యంగ్ హీరో నాగ శౌర్య. అవును మీరు వింటున్నది నిజమే.

లక్ష్మీపతికి నాగశౌర్య అంటే ఫేవరెట్ అంట. అయితే వీరు సినిమాలపరంగా కాకుండా ముందే ఫ్యామిలీ ఫ్రెండ్స్.దాంతో నాగశౌర్య గురించి లక్ష్మీ ప్రణతి కి ముందే తెలుసు. ఇక నాగశౌర్య(NAGASHOURYA) యాక్టింగ్ అన్నా కూడా లక్ష్మీ ప్రణతికి చాలా ఇష్టమట. అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఇంట్లో అంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని ఇలా యంగ్ హీరో అంటే ఇష్టమా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *